ఎమ్మెల్సీలతో ఎల్లుండి ప్రమాణం చేయిస్తా.. మండలి చైర్మన్ గుత్తా క్లారిటీ

by GSrikanth |
ఎమ్మెల్సీలతో ఎల్లుండి ప్రమాణం చేయిస్తా.. మండలి చైర్మన్ గుత్తా క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్‌కు రాలేదని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిపారు. అందుకే గవర్నర్ ఎట్ హోమ్‌కు కూడా హాజరు కాలేదని అన్నారు. ఇవాళ తనకు సమాచారం ఇవ్వకుండా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కౌన్సిల్‌కు వచ్చారని తెలిపారు. వారిద్దరితో ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయిస్తానని తెలిపారు.

కాగా, ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. ఇరువురు నేతలు కౌన్సిల్ హాల్‌కు కూడా వెళ్లారు. మండలి చైర్మన్ కోసం చాలాసేపు వేయిట్ చేసి చేసి వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, మాజీ సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకే ప్రమాణం చేయించేందుకు చైర్మన్ ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తీరుపట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం గుత్తా స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story