- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Group-2: కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా తెలుసు..! చంటిబిడ్డను లాలించిన పోలీసులు
దిశ, వెడ్ డెస్క్: కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా తెలుసని తెలంగాణ పోలీసులు(Telangana Police) మరో సారి నిరూపించారు. తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు(Group-2 Exams) జరుగుతున్నాయి. పరీక్షకు అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఓ తల్లి తన చంటి బిడ్డతో పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి వచ్చింది. చంటి బిడ్డతో పరీక్ష ఎలా రాయాలి అని కంగారు పడుతున్న ఆ తల్లికి మహిళా పోలీసులు(Women Police).. మేమున్నాం నిశ్చింతగా పరీక్ష రాయండి అని భరోసా ఇచ్చారు. మహిళా పోలీసులే కాక పోలీస్ అన్నలు కూడా ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించారు. ఒక పక్క డ్యూటీ చేస్తునే.. మరోపక్క పరీక్ష ముగిసేవరకు బిడ్డ ఆలనా పాలన చూసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. శభాష్ పోలీసన్న.. మీరు నిజంగా గ్రేట్ అని, అందరూ పోలీసులు ఒకలా ఉండరని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.