Group-1 Mains Exams:నేటితో ముగియ‌నున్న గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు

by Jakkula Mamatha |
Group-1 Mains Exams:నేటితో ముగియ‌నున్న గ్రూప్-1 మెయిన్స్  ప‌రీక్ష‌లు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ‌(Telangana)లో గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్షలు(Group-1 Mains Exams) నేటితో ముగియ‌నున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చివ‌రి రోజైన నేడు(ఆదివారం) తెలంగాణ ఉద్యమం(Telangana Movement), రాష్ట్ర ఏర్పాటుపై ప‌రీక్ష జ‌ర‌ుగుతోంది. ఈ క్రమంలో నిన్న(శనివారం) నిర్వహించిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(Science and Technology) అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌(Data Interpretation Test) పరీక్షకు 31,383 మందికి 21,181(67.4)శాతం అభ్యర్థులు హాజరైనట్టు టీజీపీఎస్సీ(TGPSC) అధికారులు తెలిపారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష(Group-1 Mains Exams)ల్లో భాగంగా శనివారం నిర్వహించిన పరీక్షలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు. ఒక్కో ప్రశ్న సాధనకు 2-3 నిమిషాలు పట్టింది. అయినా కొన్ని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు(Answers) రాబట్టలేకపోయారంట. దీంతో తమ విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అభ్యర్థులు వాపోయారు. ఈ పేపర్‌ ప్రభావం(Exam Paper Effect) గ్రూప్‌-1 ఎంపికపై పడుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. యూపీఎస్సీ(UPSC)లోనూ ఇలాంటి ప్రశ్నలు తానెప్పుడూ చూడలేదని ఓ అభ్యర్థి వాపోయాడు.

Advertisement

Next Story