- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
3,016 రూపాయలతో బతికేదెలా?.. బడ్జెట్‌పై వికలాంగుల ఆవేదన
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2023-24 బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్షం చేసిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. గత సంవత్సరం 89 కోట్లు మాత్రమే కేటాయించిందని, కానీ ఈ బడ్జెట్లో 20 లక్షల మంది ఉన్న వికలాంగుల సంక్షేమం కోసం ఎందుకు నిధులు కేటాయించలేదని పేర్కొంది. ఈ మేరకు కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడివయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు ప్రతిపాదించిందని, రెవెన్యూ వ్యయంలో 2016 ఆర్‌పీడీ చట్టం ప్రకారం 5 శాతం నిధులు అంటే రూ. 10,584.25 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 1,231 కోట్లు మాత్రమే కేటాయించిందని, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమం కోసం మాత్రం పైసా కేటాయించలేదని తెలిపారు. ఆటిజంతో 5 లక్షల మంది చిన్నారులకు, వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్స్ చేస్తున్నామని చెప్పుతున్నారు. కానీ ఈ బడ్జెట్లో నిధులు మాత్రం కేటాయించలేదని వివరించారు. మానసిక వికలాంగుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నరో బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు లేదన్నారు.
Read More..