బ్రేకింగ్: సీబీఐ అధికారులను కలిసేందుకు MLC కవిత గ్రీన్ సిగ్నల్

by Satheesh |   ( Updated:2022-12-06 15:22:35.0  )
బ్రేకింగ్: సీబీఐ అధికారులను కలిసేందుకు MLC కవిత గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ విచారణకు సంబంధించి ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ పంపిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ నెల 11వ తేదీన సీబీఐ అధికారులతో సమావేశం అయ్యేందుకు కవిత అంగీరించారు. డిసెంబర్ 11వ తేదీ 11 గంటలకు అందుబాటులో ఉంటానని కవిత సీబీఐ అధికారులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. దీంతో హైదరాబాద్‌లోని ఎమ్మె్ల్సీ కవిత ఇంటికి ఆదివారం సీబీఐ అధికారుల బృందం రానుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు సంబంధించి కవిత స్టే్ట్ మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు.

అయితే, ఈ కేసులో 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితను 6వ తేదీనే సీబీఐ ప్రశ్నించాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా నిర్ణయించుకున్న పనుల కారణంగా తాను మంగళవారం అందుబాటులో ఉండటం లేదని.. అందువల్ల విచారణ కోసం డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో విచారణకు అందుబాటులో ఉంటానని కవిత సోమవారం సీబీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆమె రాసిన లేఖకు మంగళవారం ఈ మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చిన సీబీఐ డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని మీ నివాస చిరునామాకు సీబీఐ టీమ్ వస్తుందని కవితకు సమాచారం అందించారు.

Advertisement

Next Story