కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు MLC కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-28 11:38:27.0  )
కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు MLC కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో హైదరాబాద్‌కు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆమె శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకుంటారు. ఇప్పటికే ఆమెకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ఎయిర్‌పోర్టు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దాదాపు 500 పైగా కార్లతో ఆమెను భారీ ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం తండ్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటివద్ద కవితకు స్వాగతం పలుకుతూ భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు నెలల తర్వాత కవిత ఇంటికి రాబోతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే తల్లి కల్వకుంట్ల శోభ కవిత ఇంటికి వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed