- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raj Bhavan: ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు.. కేక్ కట్ చేసిన గవర్నర్
దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్‌లో ప్రీ-క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్‌కట్‌చేశారు. ఈ ఈవెంట్ ద్వారా రాజ్‌భవన్‌లో పండుగ వాతావరణం కనిపించింది. రాజ్‌భవన్ పరివార్ సభ్యులు, పిల్లలతో కలిసి గవర్నర్జిష్టుదేవ్వర్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ ప్రీ-క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత సంగీత బృందం క్రిస్మస్పాటలు పాడారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరైన వారితో పాటు రాష్ట్రంలోని క్రిష్టియన్సోదరులకు తన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ సామరస్య విలువలను కలిగి ఉండాలని కోరారు. రాజ్‌భవన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడం, సఖ్యత పండుగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ఐపీఎస్అధికారిణి అరుణా బహుగుణ, రిటైర్డ్ ఐఏఎస్అధికారిణి రెబెల్లో, ఐఎఫ్ఎస్ అధికారిణి సోనిబాలా దేవీతో పాటు రాజ్ భవన్ సీనియర్ అధికారులు, సిబ్బంది కూడా ప్రీ-క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.