గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి అశోక్ మేనిఫెస్టో.. వాటికే పెద్దపీట

by GSrikanth |
గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి అశోక్ మేనిఫెస్టో.. వాటికే పెద్దపీట
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాలకూరి అశోక్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇండిపెండెంట్‌గా ఆయన బరిలోకి దిగారు. ఆయన నామినేషన్ ర్యాలీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా 5 వేలకు పైగా నిరుద్యోగులు ఆయన ర్యాలీలో పాల్గొన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలను పొందుపర్చారు. ముఖ్యంగా.. ముఖ్యంగా గ్రూప్స్ ఉద్యోగాల పోస్టుల సంఖ్య పెంపునకు కృషి, కానిస్టేబుల్ ఉద్యోగాల ఖాళీల భర్తీ, జాబ్ క్యాలెండర్, గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు, మెగా డీఎస్సీ, ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా పటిష్ట చర్యలు, పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా పోరాటం వంటి కీలక హామీలను పొందుపర్చారు. అంతేకాదు.. జీవో నెంబర్ -46 బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.




Advertisement

Next Story