గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో BRS దూకుడు.. కీలక వ్యక్తులకు బాధ్యతలు

by GSrikanth |
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో BRS దూకుడు.. కీలక వ్యక్తులకు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధంలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. వరంగల్ టౌన్ మినహా అన్ని సెంగ్మెంట్లకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, జనగాం సెగ్మెంట్‌కు ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పాలకుర్తికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నాయకులు చలిమెడ లక్ష్మీనరసింహారావు, భూపాలపల్లికి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, జడ్పీచైర్మన్ పుట్ట మధు, డోర్నకల్‌కు మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మహబూబాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, నాయకుడు జాన్సన్ నాయక్, ములుగుకు జిల్లా ఇన్‌చార్జీ బడే నాగజ్యోతి, ఎమ్మెల్యే కోవాలక్ష్మి, పరకాల సెగ్మెంట్‌కు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వరంగల్ వెస్ట్‌కు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్, డాక్టర్ సంజయ్, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, వర్దన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమించారు. బూత్‌ల వారీగా ఓటర్లను కలిసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని అన్నారు.

Advertisement

Next Story