- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో బీఈఎంఎల్ ప్రైవేటీకరణకు ఆర్థిక బిడ్ల ఆహ్వానం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ బీఈఎంఎల్‌లో 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు 2021, జనవరిలో నియంత్రణతో పాటు వాటా విక్రయానికి ప్రభుత్వం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అనేక ఆసక్తి వ్యక్తీకరణలను పొందిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో సంస్థ అప్రధాన ఆస్తులను బీఈఎంఎల్ ల్యాండ్ అసెట్స్‌గా విడదీసి, 2023, ఏప్రిల్ 19న కొత్త కంపెనీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేసింది. భూములు, ఇతర అప్రధాన ఆస్తుల లిస్టింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మరికొన్ని వారాల్లో మిగిలిన నిర్మాణ, రక్షణ సంబంధిత ప్రధాన ఆస్తుల కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించనున్నట్టు ఓ అధికారి స్పష్టం చేశారు. గనుల వంటి రంగాల్లో వినియోగించే భారీ ఎర్త్‌మూవింగ్ పరికరాలను తయారు చేసే బీఈఎంఎల్‌లో ప్రస్తుతం ప్రభుత్వానికి 54.03 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, ప్రభుత్వం 26 శాతం వాటాను విక్రయిస్తే దాదాపు రూ.1,500 కోట్లు సమకూరుతాయి.