- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ Governor Tamilisaiసై బదిలీ.. త్వరలోనే కొత్త వారి ఎంట్రీ?
దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ త్వరలోనే తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ కానున్నారని తెలుస్తున్నది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవాన్ని, సహకారాన్ని, ప్రోటోకాల్‌ను పొందలేకపోతున్నట్టు పలు సందర్భాల్లో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవ్వరికీ తాను తలవంచబోనని పలు సందర్భాల్లో సూటిగానే స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా అధికార పార్టీ నేతలు ముద్ర వేసినప్పుడు తమిళిసై ఒకింత నొచ్చుకున్నా.. తన మూడేండ్ల పదవీకాలంలో ప్రజాభవన్‌గా మార్చానంటూ దీటుగానే బదులిచ్చారు. తెలంగాణతో పాటు అదనపు బాధ్యతలతో పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ వ్యవహరిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిణామాలను వివరించినప్పుడే తమిళిసైని వేరే రాష్ట్రానిని మారుస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లు మాత్రమేనని రుజువైంది. కానీ ప్రస్తుతం ఆమె బదిలీ ఖాయమైందని సమాచారం.
రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి తర్వాత ప్రధాని మోడీ.. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీలో సంస్థాగతంలో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్టు బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, అసోం, మేఘాలయతో మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చాలనే అభిప్రాయంతో పీఎం ఉన్నట్టు తెలిసింది. తమిళిసై సౌందర్ రాజన్ పట్ల మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి మరో అభిప్రాయం లేకపోయినా ఆమెను తెలంగాణ నుంచి మార్చి ఆ స్థానంలో మరింత అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలనే భావనతో ఉన్నట్టు తెలిసింది. ఈ నెల చివరి నుంచి కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ఉన్నందున తగిన సమయంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ప్రజలకు చేరువై..
2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కొద్దికాలంలోనే కరోనా సంక్షోభం తలెత్తింది. వృత్తిరీత్యా ఆమె వైద్యురాలు కావడంతో నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కోరాన సోకిన వారికి ధైర్యం కల్పించారు. ప్రజాదర్బార్, మహిళా దర్బార్ లాంటి కార్యక్రమాలతో వినూత్న ఒరవడికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాజ్ భవన్ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద గ్రీవెన్స్ బాక్స్ పేరుతో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు, గిరిజనుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించారు. పౌష్టికాహార స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. మూడేండ్ల పదవీకాలంలోని అనుభవాలను ప్రత్యేక సావనీర్ రూపంలో తయారుచేసి రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి అందజేశారు.
పలు రాష్ట్రాల్లోనూ..
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న భగత్‌సింగ్ ఖోషియారీ సైతం తన బాధ్యతల నుంచి వైదొలగాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రికి ఇటీవల లిఖితపూర్వకంగా తెలియజేశారు. అనుమతి లభించగానే ఆయన స్థానంలో కొత్తవారికి నియమించనున్నారు. రాజ్యాంగబద్ధమైన పోస్టులో కొనసాగడం సంతృప్తిగా ఉన్నా.. ఇక పబ్లిక్ లైఫ్ నుంచి తప్పుకుని ప్రశాంత జీవితం గడపాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. మరో వైపు అసోం గవర్నర్ జగదీశ్ ముఖి పదవీకాలం పూర్తికానుండడంతో అక్కడ కూడా కొత్తవారిని నియమించాల్సిన అవసరం ఉన్నది. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, దాని పనితీరు, ప్రధాని మోడీ, బీజేపీపైనా సత్యపాల్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయనను కేంద్రం, ప్రధాని చూసీచూడనట్లుగానే వ్యవహరించారు. ఆయన పదవీకాలం కూడా త్వరలో పూర్తికానున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గవర్నర్ల మార్పుపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్నది. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగా కొత్త గవర్నర్‌ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశమున్నది. కేంద్ర క్యాబినెట్‌లోనూ కొందరిని తప్పించి కొత్తవారిని చేర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో గుజరాత్, తెలంగాణకు చెందిన వారికి చోటు లభించే చాన్స్ ఉన్నది.
Also Read...