మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం.. రెండు బిల్లులు రిటర్న్

by Mahesh |   ( Updated:2023-04-10 15:28:32.0  )
మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం.. రెండు బిల్లులు రిటర్న్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్ ఆమోదం కోసం వెళ్లిన పలు బిల్లుల్లో కదలిక మొదలైంది. రాజ్‌భవన్ దగ్గర పెండింగ్‌లో ఉన్న పది బిల్లుల్లో మూడింటికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. మరో రెండింటికి ఆమోదం తెలపకుండా రాష్ట్ర ప్రభుత్వానికే తిప్పి పంపారు. ఇంకో రెండింటి విషయంలో అధ్యయనం చేసిన గవర్నర్ వాటిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. ఇంకో రెండింటిని గవర్నర్ తన దగ్గరే ఉంచుకున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత ఆమోదం తెలపడంపై నిర్ణయం తీసుకోనున్నారు. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చట్ట సవరణ బిల్లులను తిప్పి పంపినట్లు తెలిపింది.

మహిళా విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు తదితరాలకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో వివరాలను రాజ్‌భవన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలియజేయనున్నాయి. గవర్నర్ ఆమోదం తెలపకుండా బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు రెండు సార్లు విచారణ జరిగింది. తాజాగా సోమవారం మధ్యాహ్నం విచారణకు రావడానికి ముందు గవర్నర్ ఈ బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకుని మూడింటికి ఆమోదం తెలిపి, రెండింటిని రాష్ట్రానికే తిప్పి పంపి, మరో రెండింటిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం గమనార్హం.

Also Read..

గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు: రెండు వారాలపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Advertisement

Next Story

Most Viewed