- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళి సై..
దిశ, నాచారం: కాప్రా సర్కిల్ పరిధిలోని మౌలాలి హెచ్. బి కృష్ణానగర్ లోని శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆదివారం రాత్రి సందర్శించారు. రంగనాథ స్వామి ఆలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలల్లో భాగంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు ఆలయ నిర్వాహకులు, ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించారు. అంతకు ముందు గవర్నర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ జి వీ ధనంజయ గవర్నర్ తమిళి సై ని ఘనంగా సన్మానించారు.
మాజీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డిలు గవర్నర్ తో కలిసి హాజరయ్యారు. అతిథులను ఆలయ నిర్వహకులు ధనంజయ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ హెచ్. బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభు దాస్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి స్థానిక నాయ కులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.