- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గవర్నర్ తమిళి సై గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ నిరుద్యోగులకు గవర్నర్ తమిళి సై గుడ్ న్యూ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిందని తెలిపారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ (TSPSC) ప్రక్షాళన ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే.. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకులోను కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై ధైర్యం చెప్పారు.