చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్

by prasad |
చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు ను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాధాకృష్ణన్ కు విమానాశ్రయంలో పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ కు మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు.

Next Story

Most Viewed