- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐదు ప్రైవేటు వర్శిటీలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్శిటీల చట్టానికి అనుగుణంగా దాదాపు రెండేండ్లుగా రాజ్‌భవన్ పరిశీలనలో ఉన్న ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఆమోదం లభించింది. ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణ నుంచి రిలీవ్ కావడానికి ముందే వీటికి సంబంధించిన పైల్‌పై సంతకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో విడుదల కానున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో గురునానక్, కావేరి, శ్రీనిధి, నిక్‌మార్, ఎంఎన్ఆర్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టడానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించిన తర్వాత 2018-19లోనే మహింద్రా, ఓక్సెన్, మల్లారెడ్డి, ఎస్సార్, అనురాగ్ యూనివర్శిటీలు ప్రారంభమయ్యాయి. ఆ జాబితాకు కొనసాగింపైగా మరో ఐదు యూనివర్శిటీలు కూడా ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేసుకున్నాయి.
అక్కడి నుంచి ఫైల్ క్లియర్ కాగానే గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్ళింది. గత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరిశీలన కోసం ఆమె దగ్గరే పెట్టుకోవడంతో ఆమోదం లభించకుండా ఈ వ్యవహారం పెండింగ్‌లో పడింది. ఆమోదం వస్తుందన్న భరోసాతో కావేరీ, గురునానక్ విశ్వవిద్యాలయాలు 2022 విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రాసెస్ మొదలుపెట్టాయి. ఫస్ట్ ఇయర్ కోర్సులు కంప్లీట్ అయ్యే టైమ్‌లో పరీక్షల నిర్వహణకు వాటికి గుర్తింపు లేక విద్యార్థులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తాత్కాలిక సర్దుబాటుతో వేరే విద్యాసంస్థల తరఫున పరీక్షలకు హాజరయ్యారు. ఇలాంటి కన్‌ప్యూజన్ నెలకొన్న సమయంలో ఐదు ప్రైవేటు వర్శిటీలకూ గవర్నర్ ఆమోదం తెలపడంతో చిక్కులు తొలగిపోయాయి.