జినోమ్ వ్యాలీని లైఫ్ సైన్సెస్‌కు చిరునామాగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి శ్రీధర్ బాబు

by Mahesh |
జినోమ్ వ్యాలీని లైఫ్ సైన్సెస్‌కు చిరునామాగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జినోమ్ వ్యాలీని ఏషియాలోనే ఆధునాతన ఫార్మా, పరిశోధనలు, లైఫ్ సైన్సెస్ చిరునామాగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లకు పైబడిన పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఔషధ పరిశ్రమ, ఆర్ అండ్ సెంటర్, మౌలిక సదుపాలయాల కేంద్రాన్ని, లారస్ లేబొరేటరీస్ యూరప్ కు చెందిన కే ఆర్ కే ఏ సంస్థ, 3జీవీ,బయోపొలిస్ సంస్థల కార్యాలయాలను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జినోమ్ వ్యాలీ అభివృద్ధి, విస్తరణపై 30 పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్థలన్ని ఉత్పత్తిని ప్రారంభిస్తే 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

లారస్ వచ్చే నాలుగేళ్లలో రూ.2,500 కోట్లు, 3జీవీ సంస్థ రూ.105 కోట్లు, బయోపొలిస్ సంస్థ రూ. 700 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయన్నారు. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సానుకూల వాతావరణాన్ని తాము కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణ పనులకు సంబంధించి హామీ ఇచ్చిన మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్రీకృత రసాయన శుద్ధి ప్లాంట్, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంపొందించడం లాంటి సదుపాయాలతో జినోమ్ వ్యాలీని ఒక ఆకర్షణీయ ఉత్పాదన, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed