ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. రోడ్డున పడ్డ వేలాది అధ్యాపకులు

by M.Rajitha |
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. రోడ్డున పడ్డ వేలాది అధ్యాపకులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం తమను అన్యాయంగా విధుల్లో నుండి తొలగించిందని రోడ్డెక్కారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు. వివరాల్లోకి వెళితే.. సాంఘిక సంక్షేమ కళాశాలల్లో పని చేసే సబ్జెక్ట్ అసోసియేట్స్, పార్ట్ టైమ్ అధ్యాపకులను అందర్నీ తొలగిస్తూ ఈనెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కారణాలు ఏమీ చెప్పకుండానే ఉన్నపలంగా ఈ తొలగింపులు చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 250 మంది సబ్జెక్ట్ అసోసియేట్స్, 4500 మంది పార్ట్ టైమ్ అధ్యాపకులు, టీచర్లు రోడ్డున పడ్డారు. తాము గురుకుల బోర్డు నిర్వహించిన వ్రాత పరీక్షలో, మౌఖిక పరీక్షలో, డెమోలో నెగ్గిన తర్వాతే విధుల్లో చేరామని.. ఇపుడు మమ్మల్ని ఏ కారణంగా తొలగించారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగారు అధ్యాపకులు. ఇప్పటికే పని చేస్తున్న వారిని అలాగే కొనసాగిస్తామని ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ.. ఇపుడు అకస్మాత్తుగా తొలగించడంతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని సంక్షేమ కళాశాలల అధ్యాపకులు హెచ్చరించారు.

Next Story

Most Viewed