విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా ప్రభుత్వ రూల్స్.. మరీ ఇంత అన్యాయమా!

by Indraja |   ( Updated:2024-02-28 10:45:29.0  )
విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా ప్రభుత్వ రూల్స్.. మరీ ఇంత అన్యాయమా!
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణాలో ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలైయ్యాయి. అయితే ఎంతో ఆశతో పరీక్ష రాయడానికి వచ్చిన ఓ విద్యార్థినికి కన్నీళ్లే మిగిలాయి. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా లోని ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పావని అనే విద్యార్థిని.. ధర్మపురిలో ఓ కళాశాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరింది.

అయితే అనివార్య కారణంవల్ల తాను పరీక్షాకేంద్రానికి 9:09 నిమిషాలకు రాగా అప్పటికే ఆలస్యం అయిందని అధికారులు ఆ యువతిని పరీక్షకు అనుమతించలేదు. పరీక్షకు అనుమతించాల్సిందిగా ఆ అమ్మాయి ప్రాధేయపడినా అధికారులు అనుమతించలేదు. దీనితో ఆ అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెనుదిరిగింది.

కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అన్నా పాపం అన్న, ప్రతి మనిషి జీవితంలో ఎదో ఒక కారణంవల్ల ఆలస్యంగా వస్తారు. దానికి పరీక్ష రాయనీక పోవడం చాల బాధాకరం.. ఎక్స్ట్రా టైం అయితే అడగరుగా.. ఉన్న టైం లో అయినా పరీక్ష రాయనివ్వండి దయ చేసి అని ఒకరు కామెంట్ చేశారు.

కేవలం ఒక నిమిషం ఆలస్యంగా రావడంవల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యే పెడుతున్న ప్రభుత్వాలు.. ఇవే ప్రభుత్వాలు పని దినాల్లో ఉద్యోగులపై కూడా ఇలా కచ్చితమైన టైం పెడితే మేలు.. అంత దమ్ము ఉండదనుకుంటా అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.



Advertisement

Next Story