సెకండరీ గ్రేడ్‌ టీచర్లను కులగణన నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం

by Mahesh |
సెకండరీ గ్రేడ్‌ టీచర్లను కులగణన నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల ఆరు నుంచి ప్రారంభం కానున్న కులగణన( caste enumeration) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT)లను మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్స్ పాల్గోననున్నారు. అలాగే కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్‌ సిబ్బందిఈనెల 6 నుంచి కులగణనలో పాల్గోననున్నారు. ఇందుకోసం ప్రైమరీ పాఠశాలలకు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల ఆరు నుంచి ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తరగతి గదులు నిర్వహించనున్నారు. అనంతరం ప్రైమరీ స్కూల్ స్టాఫ్ మొత్తం కులగణన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed