- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేపీఎస్‌లతో ప్రభుత్వం చర్చలంటూ ప్రచారం.. ఎర్రబెల్లి క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం తరపున నేను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు..అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధం అని మంత్రి ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని, ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. సీఎంకి జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉందని, ఆ పేరును చెడ గొట్టుకోవద్దని హితవు పలికారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలు మరియు చట్ట విరుద్ధం అన్నారు.
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమన్నారు. సంఘాలు కట్టబోమని, యూనియన్‌లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారని గుర్తు చేశారు. రాసిచ్చిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదన్నారు. పైగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. మీరు నాతో ఫోన్ ద్వారా మాట్లాడారు. మీరు మీ సమస్యలు చెప్పుకున్నారు. సమ్మె విరమించాలని సూచించానన్నారు. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అన్నారు. ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు విజ్ఞప్తి చేశారు.