- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాన్పుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల రికార్డ్.. ఒక్క ఏప్రిలోనే ఎన్ని ప్రసవాలు జరిగాయంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రులు డెలివరీల్లో రికార్డు సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో 29,234 ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం 13,428 డెలివరీలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెట్టింపు స్థాయిలో జరగడం గమనార్హం. 16 జిల్లాల్లో 70 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 5644, సంగారెడ్డి 1811, మేడ్చల్ మల్కాజ్గిరిలో 2874, రంగారెడ్డిలో 1308 డెలివరీలు అత్యధికంగా జరిగాయి. అతి తక్కువగా జయశంకర్భూపాలపల్లిలో 170, ములుగులో 243, ఆసీఫాబాద్‌లో 306, సిరిసిల్లాలో 307 చొప్పున రికార్డు అయ్యాయి.
ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు, డాక్టర్ల పనితీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 2014లో కేవలం 30 శాతం డెలివరీలు ప్రభుత్వంలో జరిగేవని, కానీ ఇప్పుడు ఏకంగా 70 శాతం ప్రసవాలు ప్రభుత్వంలోనే జరగడం గొప్ప విషయం అని కొనియాడారు. మన రాష్ట్రంలోనే వందశాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు అవుతున్నాయని కేంద్రం ఇటీవల గుర్తించి అభినందించిందన్నారు. అన్ని జిల్లాల్లో డెలివరీల ఫర్మామెన్స్మెరుగ్గా ఉండాలని ఆయన ట్విట్టర్వేదికగా సూచించారు.