- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రైతులకు రుణమాఫీ వర్తించదు.. తేల్చి చెప్పిన ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో భూమితో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న లోన్, వడ్డితో కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం.. పలు లోన్లకు రుణమాఫీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కలిగించింది. దీంతో ఎస్‌హెచ్‌జిలు, జెఎల్ జీలు, ఎల్ఇసీఎస్ లకు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు. అలాగే పునర్‌వ్యవస్థికరించిన, రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఈ రుణమాఫీ వర్తించదు. దీంతో పాటు వివిధ కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు కూడా రుణమాఫీ వర్తించదు. కానీ పీఏసీఎస్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.