విద్యార్థుల మరణాలపై ప్రభుత్వానికి పట్టింపు లేదు.. ఎంపీ డీకే అరుణ

by Shiva |
విద్యార్థుల మరణాలపై ప్రభుత్వానికి పట్టింపు లేదు.. ఎంపీ డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుసగా విద్యార్థులు మరణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రెండు రోజుల కితం షాద్‌నగర్‌లో నీరజ్​అదే విద్యార్ధి పాఠశాలపై నుంచి దూకి చనిపోయాడని, మళ్లీ బాలానగర్ గురుకులంలో ఉరి వేసుకొని పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య ఆత్మహత్య చేసుకున్నందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అసలు ప్రభుత్వ వసతి గృహలలో ఏం జరుగుతోందని, ఆత్మహత్యలకు గల కారణాలు నిగ్గుతేలేలా సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ సరైన నిఘా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అసమర్ధత పాలనలో వసతి గృహాల్లో మృత్యు ఘోష వినిపిస్తోందని, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed