- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మైనార్టీ మినిస్టర్ లేడన్న కేటీఆర్.. స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చిన షబ్బీర్ అలీ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై వివక్ష చూపుతోందని.. కేబినెట్‌లో ఒక్కరూ కూడా మైనార్టీ మంత్రి లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ కామెంట్లకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైనార్టీలపై కేటీఆర్ దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు చాలా మంది ఓడిపోయారని.. అంతమాత్రాన వివక్ష చూపినట్లు కాదని చెప్పారు. ఎప్పటికైనా మైనార్టీలకు మేలు చేసేది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మైనార్టీలకు కాంగ్రెస్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని అని కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. అసలు కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన చూసి.. పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.