RTC ప్రయాణీకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-30 06:30:03.0  )
RTC ప్రయాణీకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని ప్రారంభించారు. 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని, 20 లహరి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రయాణీకుల కోసం మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ కాపాడుకుంటామన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ 21 రోజుల్లో మహిళా ప్రయాణీకుల రద్దీ పెరిగిందన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మొత్తం 6 కోట్ల ఉచిత టికెట్లు విక్రయించామన్నారు.

Advertisement

Next Story