గొర్రెల గో‌‌ల్‌మాల్.. నలుగురిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

by Shiva |   ( Updated:2024-01-06 06:30:40.0  )
గొర్రెల గో‌‌ల్‌మాల్.. నలుగురిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
X

దిశ, శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తమ వద్ద గొర్రెలను కొనుగోలు చేసి తెలంగాణకు తీసుకొచ్చి ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన గొర్రెల అమ్మకందారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరు కాంట్రాక్టర్లు, పశుసంవర్ధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిపై సెక్షన్ 406, 409,420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.2.10 కోట్లు దారి మళ్లినట్లుగా ఇది వరకే అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్‌‌డీ కళ్యాణ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో విచారించగా ఇప్పటికే డబ్బు చెల్లింపులు కూడా పూర్తయినట్లు అధికారులు రైతులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన గొర్రెల అమ్మకందారులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story