- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google India : ‘మేము తెలుగోళ్ళం’ అంటున్న గూగుల్ ఇండియా ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు భాష ఒకటి. ప్రముఖ తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రముఖులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. గూగుల్ ఇండియా ‘మేము తెలుగోళ్ళం’ అంటూ ట్వీట్ చేసింది. చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటే మొదటగా మాకు గుర్తు వచ్చేది చిట్టి చిలకమ్మ పద్యం అని ఎక్స్ వేదికగా చిట్టి చిలకమ్మ పద్యం వీడియో పోస్ట్ చేసింది.
అదేవిధంగా అమ్మ భాష తెలుగులో ప్రేమతో కూడిన స్పర్శ ఉంటుందని తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కానీ ఉరుకులు పరుగుల ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు నేటి తరానికి అమ్మ భాషను అందించటంలో నామోషీగా భావిస్తున్నారని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా వెలుగులు విరజిమ్ముతున్న మన తెలుగును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.