Google Chrome: క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా.. యూజర్లకు CERT-in కీలక హెచ్చరికలు

by Shiva |
Google Chrome: క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా.. యూజర్లకు CERT-in కీలక హెచ్చరికలు
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ క్రోమ్ నిత్యం లక్షాలాది మంది నెటిజన్లు వినియోగించే బ్రౌజర్. సెర్చ్ చేసిన కంటెంట్‌ను క్షణాల్లో యూజర్ ముందు ఉంచే ఈ సూపర్ ఫాస్ట్ బ్రౌజర్‌పై ప్రస్తుతం హ్యాకర్ల కన్ను పడింది. ఈ క్రమంలోనే డెస్క్‌టాప్ సిస్టమ్స్‌లో Google Chrome వాడే యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-in) కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్‌లోను కొన్ని లోపాలు ఇటీవల తలెత్తాయని, ఆ బగ్స్‌ను ఆసరగా చేసుకుని సిస్టమ్స్ హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ఇప్పటి వరకు బ్రౌజర్‌లో ఆటో‌ సేవ్ చేసుకున్న పాస్‌వర్డ్స్ వంటి సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని CERT-in కీలక ప్రకటన చేసింది. ఇక విండోస్, మ్యాక్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్లను లేటెస్ట్ వెర్షన్‌‌కు వీలైనంతం త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని ప్రకటించింది.

Advertisement

Next Story