TS Inter Results 2024 : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్​ డేట్‌ ఫిక్స్‌!

by Disha Web Desk 14 |
TS Inter Results 2024 : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్​ డేట్‌ ఫిక్స్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్పాట్‌తో పాటు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసిన అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. ఈ నెల 23వ తేదీ మంగళవారం ఇంటర్ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఏదైనా అనుకోని ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ 24వ తేదీన ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్దమయ్యారని తెలిసింది. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ లోకి వెళ్లి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్‌ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.

Next Story

Most Viewed