మహిళా SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. TSLPRB కీలక నిర్ణయం

by Satheesh |
మహిళా SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. TSLPRB కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్‌లో గర్బీణీలు, బాలింతలకు రిక్రూట్ మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. ఏడు మార్కులు కలపడంతో దేహదారుడ్య పరీక్షలకు అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థుల్లో గర్భిణులు, బాలింతలకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తూ పోలీస్ నియామక మండలి శుక్రవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన గర్బీణీ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు అనుమతి కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.

ఎవరైతే గర్భిణీలు, బాలింతలు ప్రాథమిక పరీక్షలు అర్హత సాధించారో వారు నేరుగా మెయిన్స్ పరీక్ష రాయవచ్చని పేర్కొంది. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు ఫలితాలు వెలువడిన తేదీ నుంచి నెల రోజుల్లో దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మెయిన్స్ పరీక్ష అనుమతి కోసం గర్భిణీలు, బాలింతలు ఫిబ్రవరి 28 లోపు డీజీపీ కార్యాలయంలో సూచించిన ఫార్మాట్‌లో మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story