- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు గుడ్ న్యూస్.. ఆ పోస్టుల్లో 80 శాతం వారికే..
దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దర్ఖఖాస్తు చేసుకునే ప్రక్రియ సోమవారం నుంచి స్టార్ట్ అయింది. దరఖాస్తుకు మే 17న సాయంత్రం 5 గంటల వరకు గడువుగా విధించారు. మొత్తం 2,876 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవగా 2,301 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
దాదాపు 80 శాతం మహిళలకే కేటాయించారు. జనరల్ కింద మిగిలిన పోస్టులకు సైతం మహిళలు పోటీ పడే ఛాన్స్‌ను కల్పించారు. గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లో పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి మరింత ప్రయోజనం చేకూరనుంది. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ మహిళలవే కావడం గమనార్హం. పరీక్షల షెడ్యూలును త్వరలోనే వెబ్ సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు తెలిపింది.