తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో కోచ్ ల సంఖ్య రెట్టింపు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 8 కోచ్ లతో వందేభారత్ రైల్లు నడుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు బోగీల సంఖ్య 16కు పెంచే కసరత్తు స్టార్ట్ అయింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం 120-130 ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రిజర్వేషన్ దొరకక చాలామంది ఈ రైలులో ప్రయాణం చేయలేకపోతున్నారు. 10 రోజుల్లో వందేభారత్ రైలులో కోచ్ ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement

Next Story