నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్

by Sathputhe Rajesh |
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాప్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 12 నుంచి వన్‌టైం రిజిస్ట్రేషన్..17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు.

Advertisement

Next Story