నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై CM రేవంత్ కీలక ప్రకటన

by Sathputhe Rajesh |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం ప్రజాభవన్‌లో ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసు అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు వేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed