Viral post: నా భార్య చీట్ చేస్తోందా? తన కొలిగ్‌తో అమెరికా వెళ్లింది.. వైరల్ పోస్ట్

by Ramesh N |
Viral post: నా భార్య చీట్ చేస్తోందా? తన కొలిగ్‌తో అమెరికా వెళ్లింది.. వైరల్ పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నా భార్య తన సహచర ఉద్యోగితో కంపెనీ పని మీద అబ్రాడ్ వెళ్లింది.. అని ఓ భర్త ‘reddit’ సోషల్ మీడియాలో తన భావాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ‘నాకు 28, నా భార్యకు 24 ఏళ్లు, మాకు నాలుగు నెలల క్రితమే పెళ్లైంది. అది కూడా అరెంజ్ మార్యేజ్. ఏడాదిగా మాత్రమే మేము ఒకరికొకరు తెలుసు. అయితే తన కంపెనీ పనిమీద ఆమెను పది రోజుల పాటు అమెరికా పంపింది. నా భార్యతో తన సహచర ఉద్యోగి కూడా వెళ్తున్నాడు. ఆమెతోనే ఉంటాడు. నాకంటే ఎక్కువగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు. నేను భార్యను నమ్ముతాను కానీ ఇటీవల నా భార్య నాకు కొన్ని విచిత్ర విషయాలు చెప్పింది. ఓపెన్ మ్యారేజ్ ఓకే అని, అనుకోకుండా జరిగే శృంగారం వంటి మాటలు చాలా చెప్పింది. నా కేం అర్థమైతలేదు.. ఆమె ఈ ట్రిప్‌తో నన్ను మోసం చేయాలని ప్లాన్ చేస్తుందా?’ అని భర్త నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి స్టోరీలు చదివితే భాదగా ఉంటుందని నెటిజన్లు భర్తపై సానుభూతి చూపిస్తున్నారు. ఆమె కచ్చితంగా భర్తను మోసం చేస్తుందని నెటిజన్లు ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ ట్రిప్‌తోనే కాదు.. ఇదివరకే ఆమె భర్తను మోసం చేసిందని నెటిజన్లు చెబుతున్నారు. ఇలాంటి చదివితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలగడం లేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. తన భార్య చీటింగ్ చేస్తోందా? అని ఓ వ్యక్తి చాట్ బాట్ గ్రోక్‌ను అడగగా.. మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందని 90 శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారని గ్రోక్‌ అంచనా వేసింది.

Next Story