విద్యార్థులకు గుడ్ న్యూస్: వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. ఎన్ని రోజులంటే..?

by Satheesh |   ( Updated:2023-02-13 05:09:53.0  )
విద్యార్థులకు గుడ్ న్యూస్: వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. ఎన్ని రోజులంటే..?
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణలోని పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. మొత్తం 48 రోజుల సెలవుల అనంతరం.. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇక, ఈ ఏడాది సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి స్టార్ అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

అయితే, సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. పదవ తరగతి పరీక్షల కారణంగా ఈ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం. దీంతో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుండి పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 20వరకు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఇక, ఎండల తీవ్రత దృష్ట్యా.. మార్చి రెండో వారం నుంచి రాష్ట్ర పాఠశాలల్లోని విద్యార్ధులకు ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Next Story