విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రెండ్రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

by Anjali |   ( Updated:2024-07-06 08:37:38.0  )
విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రెండ్రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం ఉద్యోగులకు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొహర్రంను షియా ముస్లింలు సంతాప దినంగా పిలుచుకుంటారు. ముహర్రం ఇస్లామీయ కాలెండర్‌లోని మొదటినెల, ఇస్లామీయ సంవత్సరాది. మొహర్రం మాసం ప్రారంభం రోజున ఇస్లామ్ కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ కాలెండర్ ను ఉపయోగించేవారట. అయితే మొహర్రం మాసంలో 10 వ రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తుంటారు. హజరత్ ఇమాం హుసేన్‌ను స్మరిస్తూ.. తమ సంతాపం తెలుపుతారు. రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే అతి ప్రధానమైన పండుగల్లో ఇది ఒకటి. అయితే మొహర్రం సందర్భంగా తెలంగాణ సర్కారు రెండ్రోజులు హాలీడేస్ ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం.. 16, 17 తేదీల్లో ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఈ వార్త విన్న ముస్లిం విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed