- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్స్, ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేశారు.
ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి ట్వీట్ చేశారు.