Metro Rail: మెట్రో పాస్ వాడే విద్యార్థులకు గుడ్ న్యూస్!

by Ramesh N |   ( Updated:2024-04-03 11:52:31.0  )
Metro Rail: మెట్రో పాస్ వాడే విద్యార్థులకు గుడ్ న్యూస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ పాస్ తీసుకుని ప్రయాణించే విద్యార్థులకు తీపికబురు అందించింది. గతంలో మెట్రోలో ప్రయాణించే విద్యార్థులకు స్మార్ట్ కార్డు పాస్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే. 20 ట్రిప్పులకు పాస్ తీసుకుని 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని అప్పట్లో కల్పించింది. అయితే జూలై 1 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గతంలో తెలిపింది. అయితే మార్చి నెల గడువు పూర్తి కావడంతో మంగళవారం ట్విట్టర్ వేదికగా మెట్రో ఒక ప్రకటన చేసింది.

‘సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డు, మెట్రో స్టూడెంట్ పాస్ మరియు సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్‌లు మార్చి 31, 2024న ముగిశాయి. మా వివిధ మెట్రో కార్డ్‌లను ఉపయోగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే స్టూడెంట్ మెట్రో కార్డ్‌లో ప్రయాణాలు 30 ఏప్రిల్ 2024 వరకు చెల్లుబాటులో ఉంటాయి’ అని పేర్కొంది.

Advertisement

Next Story