హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

by GSrikanth |
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈనెల 25వ తేదీన ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రోజున రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు ఉంటాయని పేర్కొన్నారు. రాత్రి 12:15 గంటలకు చివరి ట్రైన్ ప్రారంభమై.. 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని వెల్లడించారు. అంతేకాదు.. ఉప్పల్ స్టేడియం - ఎన్జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు. కాగా, ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండోసారి తలపడుతోంది. తొలిసారి మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో అయినా ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Advertisement

Next Story