- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఆ నిబంధన తొలగింపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ సడలింపు ఇచ్చింది. ఇంతకాలం నీట్ హాజరు తప్పనిసరి అనే నిబంధన పెట్టినా తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు ఉత్తర్వులతో భారీ రిలీఫ్ లభించింది. టెన్త్ క్లాస్, ఇంటర్ పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా లేదా ఎంసెట్ లేదా నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటా కింద అడ్మిషన్లు పొందేలా వెసులుబాటు కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2023-24) మాత్రమే ఇది వర్తించనున్నట్లు స్పష్టం చేశారు. గత విద్యా సంవత్సరం (2022-23) అడ్మిషన్లకు అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా అమలు చేయాలని నొక్కిచెప్పారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య విశ్వవిద్యాలయం (కాళోజీ హెల్త్ వర్శిటీ) రిజిస్ట్రార్‌కు క్రిస్టినా చొంగ్తు శుక్రవారం సర్క్యులర్ పంపారు. విశ్వవిద్యాలయానికి మెరిట్ లేదా ఎంసెట్ లేదా నీట్.. వీటిలో ఏది అనువుగా ఉంటే దాన్ని క్రైటీరియాగా పెట్టొచ్చని తెలిపారు. మేనేజ్‌మెంట్ కోటాతో పాటు కన్వీనర్ కోటాకు సైతం ఇదే నిబంధనను వర్తింపజేయవచ్చునని పేర్కొన్నారు. గతంలో కన్వీనర్ కోటాకు కూడా నీట్ తప్పనిసరి అర్హతగా ఉన్నా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సూచనల మేరకు ఎంసెట్‌ను ప్రామాణికంగా వర్తింపజేసినా మేనేజ్‌మెంట్ కోటాకు మాత్రం నీట్ పరీక్షను తప్పనిసరిగా పేర్కొన్నది.
కానీ విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచీ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల యాజమాన్యం నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాకు సైతం పై మూడింటిలో దేన్నైనా ఒకదాన్ని అర్హతగా పరిగణించేలా సెక్రటరీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో దాదాపు రెండు వేల సీట్ల మేర మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీకాకుండా నిలిచిపోయిన సందిగ్ధం తొలగిపోయినట్లయింది. హెల్త్ వర్శిటీ రిజిస్ట్రార్, తెలంగాణ స్టేట్ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ ఈ అడ్మిషన్లకు సంబంధించి భారత నర్సింగ్ కౌన్సిల్ గైడ్‌లైన్స్ మేరకు సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఆ సర్క్యులర్‌లో హెల్త్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించినందుకు విద్యార్థులు, పేరెంట్స్, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల యాజమాన్యం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.