- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో కాంగ్రెస్‌దే గెలుపు.. 70 సీట్లకుపైగా.. ఏపీ ముఖ్యనేత ఆసక్తికర కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు జోస్యం చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని, 70 సీట్లు వచ్చే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి భారీ బహింగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, దీనిని బట్టి చూస్తే తెలంగాణ ప్రజల మూడ్ తెలుస్తుందని అన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని. తొమ్మిదేళ్లపాటు కుటుంబ పాలన కొనసాగించారని ఆరోపించారు.
కరీంనగర్‌లో గిడుగు రుద్రరాజు పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణకు సోనియాగాంధీ ప్రకటించిన గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, సీడబ్ల్యూసీలో చర్చించిన తర్వాతనే హామీలు ఇచ్చినట్లు తెలిపారు. సోనియాగాంధీ ప్రకటించిన హామీలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. మోదీలాగా సోనియాగాంధీ తప్పుడు హామీలు ఇవ్వలేదని, లోతుగా చర్చించిన తర్వాతే హామీలు ప్రకటించారని స్పష్టం చేశారు.