BREAKING: కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి

by Satheesh |   ( Updated:2024-03-22 07:44:25.0  )
BREAKING: కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రేటర్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. గ్రేటర్‌లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న కాంగ్రెస్.. బీఆర్ఎస్, బీజేపీలోని కీలక నేతలపై గురిపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు లీడర్లను పార్టీలో చేర్చుకుంది. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు, మాజీ మేయర్ బొంతు దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వంటి వారు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే, తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కేకే, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కాంగ్రెస్ కన్నేసింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంపీ కేకే ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వనించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా లేదా అన్న విషయంపై కార్యకర్తలతో చర్చిస్తానన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని తేల్చి చెప్పారు.

Read More:
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..?

Advertisement

Next Story

Most Viewed