GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు

by Ramesh Goud |   ( Updated:2024-09-04 15:28:44.0  )
GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భ గనులు, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు పంపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాస ప్రాంతాల్లో కొండరాళ్లను తొలగించేందుకు రాత్రింబవళ్లు పేలుళ్లు జరుపుతున్నారు. దీనిపై వార్తా పత్రికల్లో వరుస కథనాలు వెళువడ్డాయి. దీంతో ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక సీజేకు లేఖ రాశారు. డే అండ్ నైట్ దాదాపు 10 పేలుళ్లు జరిపి బండరాళ్లను తరలిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని, దీనివల్ల సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వాజ్యంగా స్వీకరించింది. బుధవారం ఈ పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. భూగర్భ గణులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంజీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. పేలుళ్లపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు వారికి కూడా నోటీసులు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed

    null