HYD: వాడివేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్

by GSrikanth |
HYD: వాడివేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడి వేడిగా జరిగింది. ఉదయం పదిన్నర గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఇతర శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యుటేషన్లపై వచ్చిన అధికారులను వెంటనే బయటికి పంపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఎమ్ఐఎమ్ కార్పొరేటర్లు సలీం బేగ్, ఎక్స్ అఫీషియో సభ్యులు, మాజీ మేయర్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ మాట్లాడుతూ.. నగరంలో విధి దీపాల నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా తయారైందని కనీసం ఫోన్ చేసినా అధికారులు రెస్పాన్స్ కావడం లేదని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో స్పందించిన మేయర్ తనకు కార్పొరేటర్లకు ఏమాత్రం సమాచారం లేకుండా జోనల్ సమీక్షా సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని, నిర్వహించాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ప్రశ్నించారు. అలాంటి సమావేశంలో పౌర సేవ నిర్మాణం నిర్వహణలపై నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని మేయర్ సూచించారు. ఆ తర్వాత వీధి దీపాల నిర్వాణపై కమిషనర్ సమాధానం చెబుతూ టైమర్లు సక్రమంగా పనిచేయకపోవటం వల్ల చార్మినార్ వంటి జోన్లలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. సమావేశం ఇంకా కొనసాగుతుంది.

Advertisement

Next Story