గంగవ్వకు సీతక్క అదిరిపోయే గిఫ్ట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-15 05:04:50.0  )
గంగవ్వకు సీతక్క అదిరిపోయే గిఫ్ట్!
X

దిశ, మల్యాల: తన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న యూట్యూబ్ స్టార్, మై విలేజ్ షో గంగవ్వకు ములుగు ఎమ్మెల్యే సీతక్క చీర పంపించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా పర్యటన చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌కి తన స్వహస్తాలతో చేసిన మిర్చి బజ్జిని అందించి అక్కడే ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఆప్యాయంగా గంగవ్వ పలకరించిన విషయం తెలిసిందే.

అయితే గంగవ్వ సహజత్వానికి ఆకర్షితురాలైన ఎమ్మెల్యే సీతక్క ఆమెకు బహుమతి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. తాజాగా అనుకున్నదే తడువుగా కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్‌తో చీర పంపించారు. మంగళవారం నాగి శేఖర్ యూట్యూబ్ స్టార్ గంగవ్వ స్వగ్రామమైన లంబడి పెళ్లి వెళ్లి తన గృహంలో శాలువాతో సన్మానించి సీతక్క పంపించిన బట్టలను అందజేశారు.

Advertisement

Next Story