- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండా ముంచిన అకాల వర్షం.. భారీగా పంట నష్టం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను రెండు రోజుల పాటు కురిసిన భారీ వడగళ్ల వాన వ్యవసాయాన్ని అతలాకుతలం చేసింది. పంటలు చేతికొచ్చే దశలో ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంటలు లేకపోయినప్పటికీ రాళ్లవానకు పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఈ నెల 17,18 తేదిలలో కురిసిన వడగళ్ల వాన రైతులను కష్టాల పాలు చేసింది.
తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయ పంటలను విత్తి ఫలసాయం పొందే రైతులున్న జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న పంటలకు భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు రైతులకు చాలా నష్టం వాటిల్లింది. వరి గింజలు నేలరాలగా మొక్కజొన్న, జొన్న చేలు నేలకొరిగాయి. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేసే పనిలో పడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి 1700 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లింది. భీంగల్, ధర్పల్లి మండలాల్లో ఎక్కువ మొత్తంలో వరి, నందిపేట్, ముప్కాల్, బాల్కొండ మండలాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. ఎడపల్లి, మోస్రా మండలాల్లో తక్కువ పరిమాణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు తెలిపారు.
మూడు మండలాల్లోని 13 గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో పంటలకు వడగళ్లు దెబ్బతీసాయని అధికారులు అంచనా వేశారు. పంటలకు వ్యవసాయ భీమా లేకపోవడంతో నష్టపరిహారం వచ్చే అవకాశాలు లేవు. 2021లోనూ వచ్చిన అకాల వర్షానికి జరిగిన పంట నష్టాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు.
కామారెడ్డి జిల్లాలో 981 ఎకరాల్లో 1153 మంది రైతుల పంట చేలు దెబ్బతిన్నాయి. 328 ఎకరాల్లో వరి, 38 ఎకరాల్లో జొన్న, 615 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. లింగంపేట్ మండలంలోని ఒక గ్రామం, గాంధారి మండలంలో 9 గ్రామాల్లో , రాజంపేట్ మండలంలో అర్గోండ, భిక్కనూర్ మండలంలో 5 గ్రామాల్లో, మాచారెడ్డి మండలంలో 2 గ్రామాల్లో, నాగిరెడ్డిపేట్‌లో 2 గ్రామాల్లో, సదాశివనగర్‌లో 3 గ్రామాల్లో, బీర్కూర్ మండలంలో రెండు గ్రామాలు, పెద్దకొడపగల్, బాన్సువాడ గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు లెక్కలు వేశారు. పంటలు పొట్టదశకు చేరుకుని నిలదొక్కుకునే సమయంలో వడగళ్ల వానకు అవి నేలకూలాయి. ఇప్పటి వరకు పెట్టిన పంట పెట్టుబడి మొత్తం రాళ్లవాన పాలైంది. ఈసారైనా రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.