మహిళలకు ఫ్రీ బస్సు స్కీం.. KTR మరో సంచలన ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-15 06:57:54.0  )
మహిళలకు ఫ్రీ బస్సు స్కీం.. KTR మరో సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలు త మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆర్టీసీలో ఛార్జీలు సాధారణ ప్రయాణీకులకు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకం ఇంప్లిమెంట్ తర్వాత భారీగా నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.295 కోట్ల భారీ లాస్‌లో కేఎస్ ఆర్టీసీ ఉన్నట్లు వార్త కథనాలు వచ్చాయి.

ఇక చేసేదేం లేక కర్ణాటక ప్రభుత్వం త్వరలో బస్సు ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఎవరైనా ‘ఫ్రీ’ అని చెబితే వాళ్లు మిమ్మల్ని రైడ్‌కు తీసుకెళ్తున్నట్లే అన్నారు. ‘ఉచితం’ అని మీకు చెప్పిన దేనికైనా ఎప్పుడూ భారీ ధర ఉంటుందన్నారు. తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటక బాటలో నడిచి బస్సు ఛార్జీలను పెంచే రోజు ఎంతో దూరంలో లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ట్వీట్‌‌కు కర్ణాటకలో ఆర్టీసీ ధరల పెంపునకు సంబంధించిన వార్తా కథనం లింక్‌ను కేటీఆర్ జత చేశారు.

Advertisement

Next Story