foxconn: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే ఫాక్స్ కాన్ లో ఎగుమతులు!

by Prasad Jukanti |   ( Updated:2025-03-17 15:30:23.0  )
foxconn: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే ఫాక్స్ కాన్ లో ఎగుమతులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని యాపిల్ ఐ ఫోన్ మేకర్ ఫ్యాక్స్ కాన్ (foxconn) కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఎయిర్ పాడ్స్ ను ఉత్పత్తి చేసి వాటి ఎగుమతి ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికగా పెట్టుకున్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీగా ఉన్న హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్స్ లోని ఫ్యాక్స్ కాన్ కంపెనీ గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ (Hyderabad) శివారులోని కొంగరకలాన్ వద్ద సుమారు 250 ఎకరాల్లో తయారీ ప్లాంట్ ఏర్పాటును మొదలు పెట్టింది. ఐ ఫోన్ల తర్వాత యాపిల్ కంపెనీ భారత్ లో తయారు చేయిస్తున్న రెండో ఉత్పత్తి ఎయిర్ పాడ్స్ మాత్రమే కాగా వాటిని కొంగరకలాన్ లో చేపట్టాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే సుమారు లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరింకల నేపథ్యంలో ఎయిర్ పాడ్స్ ప్రొడక్షన్ బయటకు తీసుకురాబోతున్న నేపథ్యంలో వ్యాపారం ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తిగా మారింది.

బీఆర్ఎస్ విమర్శలకు చెక్:

కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రంలోకి తరలి వెళ్తున్నాయని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఫాక్స్ కాన్ సైతం ఇక్కడి నుంచి తరలిపోబోతున్నదని గతంలో బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే ప్రతిపక్ష ఆరోపణలు అవాస్తవం అని అధికార పక్షం ఖండించింది. ఈ నేపథ్యంలో 14 అక్టోబర్ 2024న కొంగరకలాన్ లోని (Kongarakalan) ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. పనుల పురోగతి, ఇతర అంశాపై కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ తో వీడియో కాన్పరెన్స్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం వైపు నుండి పూర్తి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఈ కంపెనీ పురోగతిలో కీలక ముందడుగు పడింది.

Read More..

5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ 2025 ప్రకటించిన DoT

Next Story

Most Viewed